కనిగిరి: రసీదుపురం ప్రాథమిక పాఠశాలను కోట తిప్పల పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా
హనుమంతునిపాడు మండలంలోని రసీదుపురం ప్రాథమిక పాఠశాలను కోటతిప్పల ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్లకార్డులతో బుధవారం గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రసీదుపురం ప్రాథమిక పాఠశాల వద్ద మా బడి మాకు కావాలంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రసీదుపురం పాఠశాలను కోటతిప్పలలో విలీనం చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్రంగా నిరసిస్తున్నారన్నారు. అధికారులు విలీన ప్రక్రియను నిలుపుదల చేయాలన్నారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.