కనిగిరి: దివాకరపురంలో ఏర్పాటు చేసే రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీ ద్వారా రైతులకు లబ్ధి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి
పెద్ద చెర్లోపల్లి మండలం లోని దివాకరపురంలో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీతో రైతులకు ఎంతగానో లబ్ధిచేకూరుతుందని MLA ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బయోగ్యాస్ ఇండస్ట్రీ భూ సేకరణ కోసం రైతులతో పెద చెర్లోపల్లి మండలంలోని గుంటుపల్లిలో తహశీల్దార్ ఉష బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. ప్లాంట్ కోసం భూములు లీజుకు ఇచ్చే రైతులకు ప్రైవేట్ భూమికి ఎకరాకు రూ.35 వేలు, అసైన్డ్ భూమికి రూ.15 వేలు కౌలు లభిస్తుందన్నారు. రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందన్నారు.