ఉరవకొండ: వజ్రకరూరులోని లండన్ మిషన్ ఎయిడెడ్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎం ఈ ఓ తిమ్మప్ప
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలోని చర్చి వీధిలోని లండన్ మిషన్ ఎయిడెడ్ పాఠశాలను గురువారం ఎంఈఓ తిమ్మప్ప ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని పరిశీలించి మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని విద్యార్థులందరికీ అందించవలసిందిగా సంబంధిత మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు, హెచ్ఎం జయలతలకు ఆదేశించారు. ప్రభుత్వము నుండి పాఠశాలలకు సరఫరా అయిన సన్నబియ్యం, గుడ్లు, చిక్కీలు,రాగి పిండి,బెల్లం నిల్వలుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి సక్రమంగా పంపిణీ చేయాలని ఎంఈఓ సూచించారు.