దండేపల్లి: తాళ్లపేటలో ఉద్రిక్తత: మహిళలపై లాఠీఛార్జి చేశారని నిరసన
దండేపల్లి మండలం తాళ్లపేటలో బతుకమ్మ ఆడుతున్న మహిళలపై లాఠీఛార్జి జరిగిందనే ఆరోపణలతో స్థానికులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేత జగన్మోహన్రావు ఆందోళనకు మద్దతు తెలపగా, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గంతో విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది.