మంచిర్యాల: మంచిర్యాలలో హై టెన్షన్: ఎమ్మెల్యే అనుచరుల ముట్టడి వార్తలతో భారీగా మోహరించిన పోలీసులు
మంచిర్యాల బైపాస్ రోడ్డులో ఉద్రిక్తత. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు జగన్మోహన్రావు ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో, పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బేటాలియన్, స్పెషల్ పార్టీ, ఎస్డిఆర్ఎఫ్ బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు.