హాజీపూర్: గుడిపేటలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
గుడిపేటలోని 13వ బెటాలియన్ కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కమాండెంట్ వెంకటేశ్వర్లు మరియు పోలీసు సిబ్బంది అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.