కనిగిరి: లింగారెడ్డిపల్లి లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం
కనిగిరి మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం వి ఎస్ పార్వతి తల్లిపాల యొక్క ఉపయోగాలను వివరిస్తూ గ్రామంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు తల్లిపాల విశిష్టత గురించి ఆమె వివరించారు. బిడ్డ పుట్టిన అరగంట లేదా గంటలోపు తల్లి బిడ్డకు ముర్రు పాలు స్థాపించడం ద్వారా బిడ్డలు గణనీయమైన వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు. బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమైనవి అని తెలిపారు .