దర్శి: దర్శి మండలంలోని లంకోయినపల్లి, వెంకటాచలం పల్లి గ్రామాలలో దేవాలయాలలో దొంగతనం
దర్శి మండలంలోని లంకోయినపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి నందు మరియు వెంకటాచలంపల్లిలోని శివాలయం నందు దొంగతనం చోటుచేసుకుంది ఆలయంలో ఉన్న హుండీలను పగలగొట్టి హుండీలలో ఉన్న నగదను దొంగలు దోచుకు వెళ్ళినట్లు గ్రామస్తులు మంగళవారం దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగింది పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.