ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం సి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడికి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు రూ.2,035 జరిమానా విధించారు. తాము చేసిన తప్పుకు ఫైన్ వేయడాన్ని తప్పుపట్టడం లేదని, అయితే దశాబ్దాలుగా తమ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి ప్రధాన రహదారికి చేరుకోవాలంటే 3–4 కిలోమీటర్లు బురదమయమైన దారిలోనే ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. గత 24 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ గ్రామ పరిస్థితి మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు."నిబంధనలు ఉల్లంఘిస్తే మాపై ఫైన్లు వేస్తున్నారు... మరి మా గ్రామానికి రోడ్డు ఎప్పుడు వేస్తారు?" అంటూ ప్రభుత్వాలను ప్రశ్నించిన ఆయన వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #AndhraPradesh #Prakasam #Yerragondapalem #Roads #TrafficFine Helmet PublicIssue ViralVideo