*వెలుగొండకు జలకళ... గిద్దలూరులో కూటమి నాయకుల సంబరాల హోరు*
- వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం వరకు కూటమి నాయకులు ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల కావడం గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, రైతులకు అత్యంత ఆనందదాయకమైన విషయమని కొనియాడారు. ఈ జలాల రాకతో నియోజకవర్గంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెంది, రైతన్నల జీవితాల్లో సిరులు పండుతాయని ఆకాంక్షించారు.
- వెనుకబడిన మార్కాపురం ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యుల పేరు