కొండపి: జరుగుమల్లిలోని చిర్రికూరపాడులో అంకమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ
జరుగుమల్లి మండలం చిర్రికూరపాడులో ఆదివారం శ్రీ అంకమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దామచర్ల మాట్లాడుతూ.. అమ్మవారి చల్లని దీవెనతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు