గిద్దలూరు: గిద్దలూరు మండలం కే ఎస్ పల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి
గిద్దలూరు మండలం కేఎస్ పల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేస్తుంది. మృతుడు కేఎస్ పల్లి గ్రామానికి చెందిన పిచ్చయ్యగా గుర్తించారు. రాత్రివేళ కావటం ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయడంలో విఫలమైన పిచ్చయ్య డివైడర్ ని ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు