అడ్డాకుల: అడ్డాకుల మండల నూతన తాసిల్దార్ గా శేఖర్ బాధితులు స్వీకరణ
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల తహశీల్దార్ గా శుక్రవారం నుంచి కే. శేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల రైతులకు భూ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి శాంతి యుతంగా పరిష్కరించు కోవాలని తెలిపారు. మండలంలో అక్రమ ఇసుక, మట్టి, పర్మిషన్ లేకుండా ఇలాంటి ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.