అడ్డాకుల: అడ్డాకల మండలం కాటవరం తండాలో నవగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవంలో ఎమ్మెల్యే జియంఆర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల కాటవరం తండాలో సోమవారం నిర్వహించిన శ్రీ సీతారాముల వారి శివలింగం, ఆంజనేయస్వామి, నవగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవానికి ముఖ్యఅతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతకు ముందు ఆయనకు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.