అడ్డాకుల: పొన్నకల్ గ్రామ చెరువులో పడ్డ ఆటో... ఐదుగురు ప్రయాణికులకు గాయాలు
అదుపుతప్పి ఆటో చెరువులో పడ్డఘటనలో ఐదుగురికి గాయాలైన ఘటన దేవరకద్ర నియోజకవర్గంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. అడ్డాకుల మండలం రాచాలకు చెందిన దాసరి ఆంజనేయులు ఆటో నడుపుతుండగా అదుపుతప్పి పొన్నకల్ గ్రామ చెరువులో పడింది. ఆటో డ్రైవర్ తోపాటు అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు ఆటో నుంచి దూకేయడంతో భారీ ప్రమాదం తప్పింది