అడ్డాకుల: అడ్డాకుల మండల స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, మహిళ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం స్టేజీ సమీపంలో జాతీయ రహదారి- 44పై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీళ్లంతా వనపర్తి జిల్లా వాసులని తెలుస్తోంది. మృతి చెందిన మహిళ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామంగా చెందిన ఆమెగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.