గిద్దలూరు: మతిస్థిమితం కోల్పోయి నాలుగు సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు చేరిన గిద్దలూరు మహిళ మంగమ్మ
నాలుగు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్లిపోయిన గిద్దలూరు కి చెందిన మంగమ్మ అనే మహిళ తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కుటుంబ సభ్యులు ఇచ్చి వివాహం చేశారు. ఇంటి నుంచి మతిస్థిమితం కోల్పోయి వెళ్లిన మంగమ్మ మహారాష్ట్రలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందారు. మహిళా తెలుగులో మాట్లాడడానికి గుర్తించిన అధికారులు ఏపీ తెలంగాణ సీఎం కార్యాలయాలకు సమాచారం అందించారు. ఫోటోలు ఆధారంగా అధికారులు మహిళా బంధువులను కుటుంబ సభ్యులను గుర్తించి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.