రాప్తాడు: చియ్యేడు గ్రామంలో గ్రామీణ క్రీడా పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చియ్యేడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ గ్రామీణ క్రీడా పోటీల్లో ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాజ్యోతి వెలిగించి గ్రామీణ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థినీలు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తుందన, ఈ పోటీల్లో గెలుపొంది పాఠశాలకు జిల్లాకు పేరు తీసుకురావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు.