కళ్యాణదుర్గం: వైసీపీ ములకలేడు గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీలో చేరిక
సెట్టూరు మండలం ములకలేడు వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఈమె భర్త నాగరాజుతో పాటు పలువురు కార్యకర్తలు శనివారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కళ్యాణదుర్గం లోని ప్రజా వేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి చూసి పార్టీలో చేరామని చెప్పారు.