నేలకొండపల్లి: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం: నీటిపాలైన రైతుల ధాన్యం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఫ్లైఓవర్ కింద ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. కళ్లముందే పంట నష్టపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతూ, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.