నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని సిపిఎం నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సిపిఎం నాయకులను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడం ఆపాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు అరెస్టు చేయడానికి ఆయన ఖండించారు ప్రభుత్వం సమస్యలపై నిలదీస్తే అక్రమ అరెస్టు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు .అక్రమ అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరన్నారు.