నేలకొండపల్లి: కార్మికులకు పెండింగ్ వేతనాలను మంజూరు చేయాలి: పట్టణంలో టీయూసీఐ జిల్లా నాయకులు ఆవుల అశోక్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే మంజూరు చేయాలని, టియుసిఐ జిల్లా నాయకులు ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఉనికి పత్రాన్ని అందజేశారు కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.