నేలకొండపల్లి: నేలకొండపల్లిలో కాలువలో హోంగార్డు మృతదేహం కలకలం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సాగర్ కాలువలో హోంగార్డు మృతదేహం గురువారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గంట నరేష్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని సాగర్ కాలవలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును చేపట్టారు. నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య చేశారా ?అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.