నేలకొండపల్లి: నేలకొండపల్లిలో భీమ్ దీక్షను ప్రారంభించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భీమ్ దీక్షను స్వేరో స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ప్రారంభించారు. స్థానిక బౌద్ధ క్షేత్రం వద్ద రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మహానీయుల పుట్టినరోజు సందర్భంగా భీమ్ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు కులాలు మతాలకు అతీతంగా ఈ దీక్షను ప్రారంభించినట్లు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.