బయ్యారం: కొత్తపేటలో 15 రోజులుగా తాగునీటి కష్టాలు: కలెక్టర్కు విన్నవించిన సర్పంచ్
బయ్యారం మండలం కొత్తపేటలో 15 రోజులుగా నిలిచిపోయిన తాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారికి సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ వినతిపత్రం అందజేశారు. కొత్త బోరుకు మోటార్, పైప్లైన్ మంజూరు చేయాలని కోరగా, సమస్య పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు.