కనిగిరి: బీసీల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి పట్టణంలోని బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గం బీసీ ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం జరిగింది సమావేశానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ... బీసీల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి బీసీ ఐక్యవేదిక నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. బీసీ ఐక్యవేదికలో కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో త్వరలోనే మండల స్థాయి కమిటీలను పూర్తి చేసి, బీసీల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.