కనిగిరి: గోసులవీడు, ఏరువారిపల్లి, పునుగోడు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో ప్రభాకర్ శర్మ
కనిగిరి మండలంలోని ఏరువారిపల్లి, గోసుల వీడు, పునుగోడు గ్రామ సచివాలయాలను కనిగిరి ఎంపీడీవో ప్రభాకర్ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.... సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు, విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సచివాలయాల్లో సమర్పించే అర్జీలకు నిర్దిష్ట కాలపరిమితిలో వాటిని పరిష్కరించాలని ఎంపీడీవో ఆదేశించారు.