కనిగిరి: హాజీపురం లో ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీల ధర్నా
హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం గ్రామంలో ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు మంగళవారం ప్లకార్డులతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మూడు మాసాలుగా ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కూలి పనులు చేసుకుని జీవించే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలకు తక్షణం పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు , రోజువారి ఉపాధి కూలీ రూ.600లు పెంచాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు