సంతనూతలపాడు: మోటార్ బైక్ ను కారు ఢీకొన్న ఘటనలో నాగులుప్పలపాడు శ్రీ వాణి నికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ మృతి
నాగులుప్పలపాడు: మోటార్ బైకును కారు ఢీకొన్న ఘటనలో స్కూల్ ప్రిన్సిపల్ మృతి చెందిన సంఘటన త్రోవ గుంట వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగులుప్పలపాడులోని శ్రీ వాణి నికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ నన్నప్పునేని రాజారావు కుమారుడు రాఘవరావు చెన్నైలో ఉంటున్నాడు. ట్రైన్లో రాఘవరావు ఒంగోలుకు వచ్చాడు. కుమారుడిని బైకుపై ఎక్కించుకుని ప్రిన్సిపల్ రాజారావు స్వగ్రామం బయల్దేరాడు. మార్గమధ్యంలో కారు ఢీకొట్టడంతో రాజారావు స్పాట్లోనే మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.