ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించడం తగదన్న టిడిపి నాయకులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల టిడిపి నాయకులు స్థానిక టిడిపి కార్యాలయంలో సోమవారం మండల ఎంపీపీ పెద్దన్న,బెళుగుప్ప సహకార సంఘ అధ్యక్షులు కంచి రాముడు, నాయకులు పెద్ద తిప్పయ్య ఈశ్వరప్ప రమేష్ తదితర టీడీపీ పార్టీ బీసీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించడంపైన, బీసీ కులాలను హీనంగా మాట్లాడటం పైన ఖండిస్తున్నామని పేర్కొన్నారు.