కనిగిరి: చిలకపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తికి తీవ్ర గాయాలు, మానవత్వం చాటుకున్న కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
పామూరు: ట్రాక్టర్ బోల్తాపడడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, పామూరు సిఐ భీమా నాయక్ మానవత్వాన్ని చాటుకున్న సంఘటన పామూరు మండలం చిలకపాడు గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు మండలం చిలకపాడు వద్ద వేగంగా వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో, ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి ఆ సమయంలో పామూరుకు వెళ్తున్న డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సిఐ భీమా నాయక్ ప్రమాదాన్ని గమనించి, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని పోలీసు వాహనంలో పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, మానవత్వం చాటుకున్నారు.