కొండపి: మర్రిపూడిలోని చిలంకూరులో భూసార పరీక్షా ఫలితాలు ఆధారంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన : జిల్లా వ్యవసాయ శాఖ జేడిఏ
మర్రిపూడి మండలం లోని చిలంకూరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం నందు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగించాలనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ శాఖ జెడిఎ శ్రీనివాసరావు పాల్గొని రైతులకు పలు సూచన సలహాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రసాయన ఎరువులను అధికంగా వాడడం వలన భూములు నిస్సారమవుతాయని తెలిపారు.అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు.