నేలకొండపల్లి: నేలకొండపల్లిలో కారు, బైక్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
నేలకొండపల్లి మండలం మండ్రాజ్ పల్లి కొత్తూరు సమీపంలో బుధవారం ఉదయం కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అమ్మగూడెం గ్రామానికి చెందిన అడపాల శశివర్ధన్ తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.