ఉరవకొండ: ఎల్ నినో ప్రభావం మరియు తక్కువ కాల పంటల సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని హనిమిరెడ్డిపల్లి, సీర్పి, గంగవరం, గుండ్లపల్లి గ్రామాలలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం సోమవారం పర్యటించి క్షేత్రస్థాయిలో పొలాలను సందర్శించారు. రైతులకు ఎల్ నినో ప్రభావం నుండి పంటల రక్షణ పై శాస్త్రవేత్త బాలాజీ నాయక్ తదితరులు సూచనల్లో భాగంగా పొటాషియం నైట్రేట్ లేదా19-19-19 ఎకరానికి ఒక కేజీ చెప్పనా పిచికారీ చేయాలన్నారు. ప్రస్తుతం వచ్చే వర్షానికి తక్కువ కాల పంటలను అనగా పెసర ,సజ్జ ,జొన్న సాగు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మల్లికార్జున, హరిణి, గోవర్ధన్ ,నాగేశ్వరి, భాను రేఖ గ్రామ వ్యవసాయ సిబ్బంది ,రైతులు పాల్గొన్నారు.