మార్కాపురం: మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై రసవత్తరంగా మారిన మార్కాపురం రాజకీయం
మార్కాపురం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల కోసం రసవత్తరం నెలకొన్నది. టిడిపి వైసిపి పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి గత రెండు పర్యాయాలు చైర్మన్ పీఠం కట్టబెట్టారు. రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ వర్గానికి చైర్మన్ పదవి కేటాయించాలని ముస్లిం మైనార్టీ నాయకులు వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ఇరు పార్టీలకు ముస్లిం మైనార్టీ కీలకంగానున్నారు. దీంతో రాజకీయ చర్చ మొదలైంది.