దామెర: హనుమకొండ: ఊరుగొండ వద్ద జాతీయ రహదారి పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద నాగ్పూర్–విజయవాడ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. తమ భూములకు మార్కెట్ ధర కంటే తక్కువ పరిహారం ఇస్తున్నారని, నష్టపరిహారం అందే వరకు పనులు కొనసాగనివ్వమని రైతులు నిరసన తెలిపారు.