దామెర మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరానికి గాను ఎంత శాతం విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ అయిందని, కొత్త యూనిఫామ్స్ విద్యార్థులకు ఇచ్చారా, ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే వివరాలను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాలు చెబుతున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.