పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిరిగా నాటాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారుగురువారం దామర మండలం ఓగులాపూర్ గ్రామంలోని సైలని బాబా దర్గాలో దర్గా పీఠాధిపతి హజ్రత్ పీర్ హాజి ముహమ్మద్ అబ్దుల్ హమీద్ షా మియ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.