కోగిల్వాయిలో పంచాయతీ కార్యదర్శి చేసిన పొరపాటుతో రోడ్డున పడ్డామన్న కుటుంబం, బాధితులు ఆవేదన వ్యక్తం
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని కోగిల్వాయి గ్రామంలో ఓ పంచాయతీ కార్యదర్శి చేసిన పొరపాటుతో ఓ కుటుంబం రోడ్డున పడింది. గ్రామానికి చెందిన పోటు రవి, సునిత దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందంటూ కొన్ని రోజుల కిందట పంచాయతీ కార్యదర్శి మంజూరు పత్రాన్ని అందజేశారు. దీంతో శిథిలావస్థలోని రేకుల ఇంటిని కూల్చివేశారు. పిల్లర్ల కోసం గుంతలు తవ్వుదామనుకునే సమయంలో ఆమె నిర్మాణ స్థలం వద్దకు వచ్చి మీకు ఇల్లు మంజూరు కాలేదని.. ఆ మంజూరు పత్రం మీది కాదని చెప్పారు. ఒకే రకమైన పేర్లు ఉండడంతో మరొకరి మంజూరు పత్రాన్ని మీకు ఇచ్చామంటూ చెప్పి దాన్ని వెనక్కితీసుకున్నారు.