దామెరలోని మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని దామెర కుట్టు శిక్షణ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా కుట్టు శిక్షణ కేంద్రం ట్రైనర్స్, కుట్టు శిక్షణలో మెలకువలు నేర్చుకుంటున్న మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. కుట్టు శిక్షణ కేంద్రం గురించిన వివరాలను నిర్వాహకులు, అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.