కొండపి: కొండపి నియోజకవర్గం లో ఇప్పటివరకు 1640 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశాం: మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో 116 మంది లబ్ధిదారులకు రూ.90 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు నియోజకవర్గంలో 1640 మందికి రూ.12 కోట్ల 92 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. ఆరోగ్య అవసరాలకు పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని సీఎం రిలీఫ్ ఫండ్ తో అండగా నిలుస్తున్నామన్నారు.