కనిగిరి: పామూరులో అంగరంగ వైభవంగా శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు, హనుమంత వాహనంపై ఊరేగిన స్వామి
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం రాత్రి శ్రీ మదన వేణుగోపాల స్వామి హనుమంత వాహనంపై పామూరు మాడవీధుల్లో ఊరేగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ ఈవో నరసింహా బాబు తోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.