కనిగిరి: యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు: కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి
కనిగిరి: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం అలవర్చుకోవాలని కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి సూచించారు. కనిగిరిలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి ఆదివారం యోగ సాధన చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చన్నారు. యోగ సాధన చేయడం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, కమిషనర్ డేనియల్ జోసఫ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.