కొండపి: సింగరాయకొండ పాకాల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శివ కిరణ్ అనారోగ్యంతో మృతి, నివాళులు అర్పించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల జర్నలిస్ట్ శివకిరణ్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న మంత్రి స్వామి శనివారం వారి స్వగృహానికి వెళ్లారు. మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలానే స్థానిక రాజకీయ నేత మాదాసి వెంకయ్య కూడా శివకు నివాళులు అర్పించి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.