రాప్తాడు: రాప్తాడులో రెండేళ్లు కూటమి ప్రభుత్వం పాలనపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం ఉదయం పదిన్నర నుంచి రెండు గంటల వరకు రెండేళ్ల కూటమిపాలనపై డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రెండేళ్ల కూటమి పాలనపై ప్రజల్లో అభిప్రాయాలు తెలుసుకునేందుకు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రజలకు వివరిస్తున్నామని ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని కూటమి చేసిన అభివృద్ధి గురించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.