కొత్తగూడెం: పాల్వంచ నాగారం వద్ద మైనింగ్ అధికారుల తనిఖీలు: వాహనాల పరిశీలన
పాల్వంచ మండలం నాగారం పరిధిలో మైనింగ్ ఏడీ దినేశ్ ఆధ్వర్యంలో 20 వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. వాహనాల్లో ఎలాంటి ఓవర్లోడ్ లేదని, అన్నీ సరైన ధ్రువపత్రాలతో ఉన్నాయని నిర్ధారించారు. అనుమతి లేకుండా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.