మహబూబాబాద్: పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటిన మహబూబాబాద్ డీఎస్పీలు
హైదరాబాద్లో జరిగిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మహబూబాబాద్ ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ ఒక బంగారు, రెండు రజత పతకాలను సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ వారిని అభినందించారు.