Public App Logo
Profile Picture

REVATHI

@v50669
3Followers
0Following
అశ్వారావుపేట: భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

 విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలి 

 మేధో వైకల్యం కలిగిన విద్యార్థులకు ఇంటి వద్దే విద్యాబోధన అందించాలి

చుంచుపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృతంగా పర్యటించి భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించడంతో పాటు చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా చుంచుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సర్వే పురోగతి, భూ సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చుంచుపల్లి గ్రామ పరిధిలో మొత్తం 2 వేల 27 ఎకరాల 30 గుంటల భూమి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ భూములతో పాటు వ్యవసాయ భూముల భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భూ సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించడంతో పాటు, సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించి భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యాబోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతిని, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి సారించి, పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

మేధో వైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించి, వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలకు హాజరు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అటువంటి విద్యార్థులకు ఇంటి వద్దే విద్యాబోధన అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి విద్యకు దూరం కాకుండా, వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, తాగునీరు, పారిశుధ్యం తదితర సదుపాయాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు . పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ పరిశీలనలో తహసీల్దార్ నాగరాజు, సర్వే అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు*

క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచి 111 పాయింట్లతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.జిల్లా క్రీడాకారులు వివిధ విభాగాల్లో *12 బంగారు, 9 వెండి, 6 కాంస్య* పతకాలు సాధించి మొత్తం *27 పతకాలు* సాధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ విజేతలైన యువ క్రీడాకారులను అభినందించారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తూ కనీస వసతులు, సదుపాయాలు అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టడం ఎంతో గర్వకారణమని అన్నారు.క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలతో పాటు చదువుపై కూడా సమానమైన శ్రద్ధ చూపుతూ విద్యలోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని  సూచించారు.

జిల్లా యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటిన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
కొత్తగూడెం: రూ.1.82 కోట్ల గంజాయి పట్టివేత..

365 కేజీల గంజాయి స్వాధీనం.

 లారీ కారు బైక్ స్వాధీనం.

 ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.

 ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు మూడు వాహనాల్లో తరలి వెళ్తున్న గంజాయిని ఖమ్మం జిల్లా భద్రాచలం డిటిఎఫ్ ఇతర ఎక్సైజ్ టీములు కలిసి  పట్టుకున్నారు.

 ఈ మూడు వాహనాల్లో 365 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 పట్టుకున్న గంజాయి విలువ రూ. 1.82 కోట్లుగా ఉంటుందని ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.

 కేసు వివరాల్లోకి వెళితే..

 భద్రాచలం వీరభద్ర ఫంక్షన్ హాల్  సమీపంలో డిటిఎఫ్ కొత్తగూడెం టీం తనిఖీలు నిర్వహించారు.

 ఈ తన్కీలో తొలతగా బైక్ పై వస్తున్న వ్యక్తి వద్ద తొమ్మిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 ఒరిస్సా కు చెందిన దివాకర్ మండల్(22) అనే వ్యక్తి వద్ద 9 కిలాల గంజాయితో పాటు బైకును సీజ్ చేశారు.

 బైక్ వెనక వస్తున్నటువంటి హుందాయి కార్ పై అనుమానం వచ్చి ఎక్సైజ్ టీములు తనిఖీలు నిర్వహించగా కారులో 100 కేజీల గంజాయి లభ్యమైంది.
 ఈ కేసులో ఎలక్ట్రిషన్ గా పనిచేసే అటువంటి ఒరిస్సాకు చెందిన సుమన్ పాల్ (22)
 అదుపులోకి తీసుకున్నారు.
 కారు బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించగా మరో లారీలో కూడా గంజాయి ఉన్నట్లు నిందితులు ఇచ్చిన సమాచారం..

 కరుణ కరుణగిరి వద్ద ఆగి ఉన్నటువంటి లారీని తనిఖీలు చేయగా 263.2 కేజీల గంజాయి పట్టుబడింది.

 లారీ లో ఉన్న రాజశేఖర్ మార్గి (22), లారీ లో ఉన్న క్లీనర్ బ్రిజన్ నాసా(20) ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరు కూడా ఒరిస్సాకు చెందిన వ్యక్తులుగానే గుర్తించారు లారీ కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందినదిగా ఉంది.
 కొత్తగూడెం డిటిహెచ్ సిఐ రమాదేవి మరో సిఐ కిష్టయ్య, నరేందర్ రెడ్డి తో పాటు ఎస్ఐ సలీముల్లా ఖాన్ శ్రీధర్ రావులతో కలిపి సిబ్బంది
కరీం, మౌలాంకర్, వీరబాబు, శ్రీనివాస్, నర్సింహరావు, రమేష్, పార్థసారధి, విల్సన్, సీతారాం, వీరభద్రం, రాకేష్, కిరణ్, ప్రసన్న కుమార్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

 గంజాయిని పట్టుకున్నటువంటి ఖమ్మం టీంలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్ రావు,ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు.
కొత్తగూడెం: పాల్వంచ మండలం జగన్నాధపురం రైతు వేదికలో.. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా.. సఫాయి మిత్ర భద్రతే- స్వచ్ఛతకు తొలిమెట్టు నినాదంతో
మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్.. ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ DRDO విద్యా చందన,DPO అనూష..

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య రక్షణ నిమిత్తం హెల్త్ క్యాంప్స్ వారికి అవసరమైన ఇన్సూరెన్స్ చేపించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పాల్వంచ మండలంలోని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపును
 జగన్నాధపురం రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షుగర్ బీపీ ఇతర అనారోగ్య సమస్యలను ప్రైమరీ హెల్త్ సెంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి ఆరోగ్య రక్షణ నిమిత్తం అవసరమైన ఇన్సూరెన్స్ స్కీములు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే హయ్యర్  హాస్పిటల్స్ కి రిఫర్ చేస్తామని వివరించారు.
కొత్తగూడెం: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత!

 కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం

భద్రాచలంలో కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఎక్సైజ్‌ శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నట్లు సమాచారం.

 సుమారు 100 కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసుపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

 గంజాయి ఖచ్చితమైన పరిమాణం, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అనే పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.
 మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...
భద్రాచలం: బెక్కంటి ఎక్కడ ఉంటే ఆ పాఠశాలకి అభివృద్ధి  సుగమం-MLA తెల్లం.వెంకట్రావు*
 
    మారుమూల ప్రాంతం నుండి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకొని ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును  ఉన్నత శిఖరాలలో ఉండే విధంగా  అద్భుతంగా  తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి బెక్కంటి శ్రీనివాసరావు అని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావ్  కొనియాడినారు.

      బుధవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురంలో జరిగిన ప్రధానోపాధ్యాయిని పదవీ విరమణ వీడ్కోలు సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి  శంభు ప్రసాద్ హాజరై బెక్కంటికి ఘన సన్మానం నిర్వహించారు.

    ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ  బెక్కంటి శ్రీనివాసరావు  పనిపట్ల కలిగిన అంకితభావము, క్రమశిక్షణ, ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనాన్ని పెంచాయని అభినందించారు. 

      చర్ల, పినపాక, అశ్వాపురం, ములకలపల్లి MEO లు మాట్లాడుతూ స్టేట్ రిసోర్స్ గ్రూప్ పర్సన్ గా, గణిత  ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయులుగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న బెక్కంటి శ్రీనివాసరావు 2 నెలలు ఎంఈఓ పనిని  తన వాగ్దాటితో, లౌక్యంతో, పట్టుదలతో పరిపాలన చేశారని  తను అనుకున్న పనిని నెరవేర్చేదాక నిద్రపోని గొప్ప వ్యక్తి
 బెక్కంటి  అని తన వ్యక్తిగత పనుల కంటే తన పాఠశాల పనులకు, విద్యా వ్యాప్తికి గిరిజన ప్రాంతంలో గణనీయమైన కృషి చేశారని,   పాఠశాలకి కావలసిన మౌలిక వసతులు ఏమైనా సమకూర్చాలంటే బెక్కంటి శ్రీనివాసరావుకు  మరి ఎవరు సరిలేరని బెక్కంటి శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. 

    జగదీష్ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్  UPS జగదీష్ కాలనీ పాఠశాల మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారిగా  పాఠశాలల యొక్క పనితీరు మెరుగుపరచడంలోనూ, వికలాంగుల దినోత్సవం నిర్వహణలోనూ, మండల స్థాయి గేమ్స్ నిర్వహణలోనూ, మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను సమన్వయం చేయడంలోనూ మంచి అధికారిగా సమన్వయకర్తగా సేవలు అందించారని భద్రాచలం మండలాన్ని జిల్లాలోనే ఉన్నత స్థితిలో ఉంచడానికి వారు చేసిన కృషిని ప్రశంసించారు.

 కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ దశం బాబు  మాట్లాడుతూ ఈరోజు మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను ఉత్సాహపరుస్తూ  ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ఉన్నాయని పత్రిక మాధ్యమం ద్వారా కాంప్లెక్స్ ను మరియు దుమ్ముగూడెం మండలాన్ని అగ్రగామిలో ఉంచడానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయునిగా బె క్కంటి గారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 

 పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ మాట్లాడుతూ ప్రతి నెలలో కనీసం  20 పాఠశాలలు సందర్శిస్తూ  పాఠశాలలో ఉన్నటువంటి ఔత్సాహిక  విషయాలను  గుర్తించి ఉపాధ్యాయులను ప్రోత్సహించి పాఠశాలలు ఏ విధంగా ఉండాలని తెలియజేసిన గొప్ప వ్యక్తి అని కొని యాడినారు.

 నర్సాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులైన అనిల్  మాట్లాడుతూ బెక్కంటి గారు గత మూడు సంవత్సరాలుగా మా పాఠశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పాఠశాలకి కావలసిన మౌలిక వసతులైనటువంటి గ్రౌండ్, శానిటేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ విద్యార్థులకు ఏర్పాటు చేయడంలోప్రధానోపాధ్యాయుల కృషి మరువలేనిదని కొనియాడారు. గత రెండు సంవత్సరాలుగా 100% పదో తరగతిలో రిజల్ట్ పాఠశాలకు తీసుకురావడంలో  మారుమూల ప్రాంతంలోనైనా విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదగా సైకిళ్లు  ఇప్పించడం ద్వారా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలైన ల్యాబ్,గ్రౌండ్ అనేక కనీస అవసరాలు సమకూరుస్తూ, ఉపాధ్యాయులకు ఎంతో చేదోడు, వాదుడుగా ముందుకు తీసుకెళ్లిన సార్ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే చాలా బాధగా ఉంది అని పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా తమ మాటల్లో తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, పినపాక మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, అశ్వాపురం మండల విద్యాశాఖ అధికారి వీరాస్వామి, చర్ల మండల విద్యాశాఖ అధికారి రమణ, ములకలపల్లి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే  మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా 
బెక్కంటి శ్రీనివాస్ రావును ఘనంగా సన్మానించారు.

   ఈ కార్యక్రమంలో బెక్కంటి శ్రీనివాస్ రావు  తన చిన్ననాటి ఏడవ తరగతి గురువుగారికి సాష్టాంగ ప్రణామములు  చేసి వారిని సన్మానం చేయడం సభికులను ఆనందపరిచింది.

 కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బెక్కంటి  శ్రీనివాస్ రావు  తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు తనను ఒక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్థానాన్ని కల్పించిన ఈ మన్యం ప్రాంతానికి రుణపడి ఉంటానని తన జీవితంలో విద్యావ్యాప్తికి తను చేసే ప్రతి పనిలో సహకరించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ లోని అనేక మంది ఉపాధ్యాయులు గ్రామస్తులు పలు రాజకీయ పార్టీ నాయకులు మరియు అన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొని బెక్కంటి  సేవలను కొనియాడారు. ఘనంగా నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.
అశ్వారావుపేట: అశ్వారావుపేట

రెండు బైక్ లు ఢీ కొని ఒక వ్యక్తి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొన్న ఘటనలో చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన మంగళగారి శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలై రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను అంబులెన్స్ లో అశ్వరావుపేట తరలించారు. తీవ్ర గాయాలు ఇద్దరిలో వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం  కొత్తగూడెం తరలిస్తున్నారు . సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద #ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కొత్తగూడెం: యూపీహెచ్‌సీ ఓల్డ్ కొత్తగూడెంలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
సఫాయి మిత్రలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన

కొత్తగూడెం, సెప్టెంబర్ 30: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ బుధవారం ఓల్డ్ కొత్తగూడెంలోని **అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)**ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, రిజిస్టర్లు మరియు ఆరోగ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు.

సిబ్బందికి డీఎంహెచ్‌ఓ సూచనలు
గర్భిణీల ప్రసవ అంచనా తేదీలకు సంబంధించిన EDD క్యాలెండర్‌ను మూడు నెలలకు సంబంధించిన వివరాలతో క్రమం తప్పకుండా నిర్వహించాలి.

గత నెల, ప్రస్తుత నెల, రాబోయే నెలకు సంబంధించిన EDD వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించి అందుబాటులో ఉంచాలి.

గర్భిణీలను ప్రసవానికి ముందే గుర్తించి, అవసరమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి.
ప్రయోగశాలను పరిశీలించి, మలేరియా మరియు డెంగ్యూ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్లు తగినంతగా అందుబాటులో ఉండేలా స్టాక్‌ను నిరంతరం పర్యవేక్షించాలని ల్యాబ్ టెక్నీషియన్‌కు సూచించారు.
అన్ని రికార్డులు, రిజిస్టర్లు మరియు స్టాక్ వివరాలను సక్రమంగా నమోదు చేసి, ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.
సఫాయి మిత్రల భద్రత, ఆరోగ్యంపై అవగాహన
అనంతరం సఫాయి మిత్ర – సేఫ్టీ అండ్ డిగ్నిటీ క్యాంప్లో డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం రాథోడ్ పాల్గొని సఫాయి మిత్రల ఆరోగ్యం, భద్రత మరియు గౌరవానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఆరోగ్యంపై ముఖ్య సూచనలు
ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.
శరీరానికి అవసరమైనంత సురక్షితమైన తాగునీటిని పుష్కలంగా తీసుకోవాలి.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి.
కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య చికిత్స పొందాలి.
పాము కాటు సంభవించినప్పుడు వెంటనే వైద్యసేవలు పొందాలి.
పాము కాటు లేదా జంతు కాటు సందర్భాల్లో మంత్రాలు, మూఢనమ్మకాలు, మతపరమైన వైద్యం లేదా ఇతర శాస్త్రీయ ఆధారం లేని పద్ధతులను నమ్మి సమయం వృథా చేయకూడదని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే సమీప ప్రభుత్వ ఆసుపత్రి/ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని తెలిపారు.

సఫాయి మిత్రలు పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి భద్రత, ఆరోగ్యం మరియు గౌరవం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం. సుకృత గారు , మెడికల్ ఆఫీసర్, యూపీహెచ్‌సీ గుడిపాడు,డాక్టర్ జాన్సీ రామ్ మెడికల్ ఆఫీసర్ పాత కొత్తగూడెం, డాక్టర్ కృష్ణ కుమారి శేఖరం బంజార, మున్సిపల్ మేయర్ గణేష్ గారు , కమిషనర్ సుజాత, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు సఫాయి మిత్రలు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కార్యాలయం నందు కార్యాలయం సిబ్బందికి నిన్నటి ప్రపంచ హృదయ  దినోత్సవం సందర్భంగా గుండెకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి , జాగ్రత్తలు పాటించకుంటే జరిగే నష్టాల గురించివివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో  కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ..
పాల్వంచ శ్రీనివాస కాలనీ శివాలయం సమీపంలో
భారీ కొండచిలువ కలకలం... భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు.. మున్సిపల్,ఫారెస్ట్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం.. భారీ కొండచిలువను బంధించిన స్నేక్ క్యాచెర్స్..

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ ఎనిమిదవ డివిజన్ పరిధిలో కొండ సమీప ప్రాంతంలో గల శివాలయం వద్ద సుమారు 12 అడుగుల భారీ కొండచిలువను గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యామని, 50 నుంచి 60 కేజీల బరువు గల భారీ కొండచిలువ సమాచారాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన నేపద్యంలో కొత్తగూడెం నుంచి వచ్చిన స్నేక్ చార్చేర్స్ భారీ కొండ చలవను చాకచక్యంగా సురక్షితంగా బంధించారని, ఫారెస్ట్ అధికారుల సమక్షంలో సుదూర ప్రాంతంలో గల అడవిలో కొండచిలువను వదిలిపెట్టడం జరిగిందన్నారు. స్థానిక ప్రజలు పరిశుభ్రత పాటించాలని చెత్తాచెదారం దట్టంగా పెరగడంతో ఇట్లాంటి విషాసర్పాలు కాలనీలోకి వస్తున్నాయని మున్సిపల్ అధికారులు పారిశుభ్యం పట్ల శ్రద్ధ వహించాలని, అదేవిధంగా ఇంటి పరిసరాలలో చెత్తాచెదారాన్ని పరిశుభ్రం చేయని స్థానిక ప్రజలపై సైతం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కొత్తగూడెం: అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు*

జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వరస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించిన  హెడ్ కానిస్టేబుల్ హరి గోపాల్ కుటుంబానికి బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో చెక్కు రూపంలో 1,00,000/-(లక్ష రూపాయల) నగదును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మరణించిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ప్రభుత్వం తరఫున మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా  చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.
కొత్తగూడెం: గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారి కమిషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతిగృహాలలలో పనిచేయుచున్న సి ఆర్ టి టీచర్లను బదిలీలు చేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.

       మంగళవారం నాడు ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరములో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల అబ్జర్వర్ కమిటీ సభ్యుల సమక్షంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో పనిచేయుచున్న సిఆర్టి టీచర్లను కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ బదిలీల ప్రక్రియలో భార్యాభర్తలు, వికలాంగులు మరియు మెడికల్ పరంగా, వితంతు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగిందని అన్నారు. అందులో సబ్జెక్టుల వారిగా తెలుగు-06, గణితం -12,ఇంగ్లీష్-09, ఫిజిక్స్ -09, బయో సైన్స్ -09, సాంఘిక శాస్త్రం -08, ఎస్ జి టి -06, పిడి -01, పీ ఈ టి-01, ఎల్ పి టి -01 మొత్తం 67 మందిని కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశామని ఆయన అన్నారు.

     ఈ బదిలీల ప్రక్రియ ఎటువంటి అవకతవకలకు తావులేకుండ టీచర్లు అందరూ సంతృప్తి చెందేలా బదిలీలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. 

        కార్యక్రమంలో ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఫిరంగి, ఏసీఎమ్ఓ రాములు, ఏటీడీవో రమేష్  మరియు కార్యాలయం సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన అధికారులను సిబ్బందిని ప్రశంసించిన భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల శ్రేష్ట

       తొమ్మిది రోజులపాటు వినాయక నవరాత్రులు జరుపుకొని భద్రాచలంలోని గోదావరిలో నిమజ్జనానికి వివిధ జిల్లాల నుండి వచ్చిన వినాయక ప్రతిమలు భక్తులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత సిబ్బంది తగ జాగ్రత్తలు తీసుకొని వినాయక నిమజ్జనం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 

        వినాయక చవితి పండుగ ప్రారంభమైన మూడవ రోజు నుండి గోదావరి కరకట్ట ప్రదేశాలలో నిమజ్జనానికి వినాయక ప్రతిమలను భక్తులు తీసుకొని రావడం జరిగిందని అలాగే పక్క జిల్లాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భద్రాచలం గోదావరిలో వినాయక ప్రతిమలు నిమజ్జనం చేయడానికి రావడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరియు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం సహాయంతో భక్త మండల్ లకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం చేయడం జరిగిందని, 20 అడుగుల పైన ఉన్న వినాయక ప్రతిమలను  నిమజ్జనం చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, విగ్రహాలను క్రేన్ సహాయంతో తీసేటప్పుడు భక్తులు గాని చూడడానికి వచ్చే ప్రజలు గాని ఎవరూ ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని వారి వాహనాలలో నుంచి తీసి మెల్లగా గోదావరిలో నిమజ్జనం చేయడం జరిగిందని అన్నారు.

    వినాయక భక్తమండలి సభ్యులు అధికారుల సూచనలను  పాటించి అతి భారీ వినాయక ప్రతిమలను సురక్షితంగా నిమజ్జనం చేసే విధంగా అధికారులకు సహకరించారని అన్నారు. 

       గోదావరి కరకట్ట ప్రదేశాలలో నిమజ్జన కార్యక్రమానికి పగడబందీగా విధులు నిర్వహించిన ఐటీసీ డిప్యూటీ జిఎం చంగల్ రావు, భద్రాచలం తాసిల్దార్ రామ్ కుమార్, ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, ఇరిగేషన్ ఈ ఈ రాంప్రసాద్, ఎం వి ఐ వెంకట పుల్లయ్య, జిపిఈఓ శ్రీనివాస్, ఎన్ డి ఆర్ ఎఫ్, విద్యుత్ మత్స్యశాఖ ఎస్ సి సి ఎల్, అగ్నిమాపక, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు మరియు వారి బృందానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.
భద్రాచలం: అర్హత సాధించిన అంగనవాడి ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు-సిడిపిఓ జెట్టి విజయ కుమారి*

      
    దుమ్ముగూడెం ప్రాజెక్టు నందు ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకొని అర్హత సాధించిన అభ్యర్థులకు భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూ లు నిర్వహించడం జరుగుతుందని సిడిపిఓ జెట్టి విజయ కుమారి మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

     మొత్తము 105 ఖాళీలకు గాను  486 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 207 అభ్యర్థులు అనార్హులు
గాను, 279 అభ్యర్థులు అర్హులు గాను గుర్తించడం జరిగిందని అన్నారు.

    అర్హత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కొరకు కాల్
లెటర్స్ పంపించడం జరిగిందని, వీరికి ఈనెల 30 సెప్టెంబర్ 2026 తారీఖున స్థానిక భద్రాచలం నందు మండల ప్రజా పరిషత్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు.

    దుమ్ముగూడెం ప్రాజెక్టు నందు ఉన్నటువంటి భద్రాచలం మండలం మరియు దుమ్ముగూడెం మండలం వారికి విడివిడిగా ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతోందని, దుమ్ముగూడెం మండలం వారు మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం మండలం వారు సాయంత్రం 4 గంటలకు పైన తెలిపినటువంటి ఇంటర్వ్యూ ప్రదేశానికి సకాలంలో వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ , కాల్ లెటర్ మరియు ఒక జత జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు హాజరు కావలసిందిగా ఆమె కోరారు.
కొత్తగూడెం: ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

 *రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ – సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్* 

 *ధాన్యం నిల్వకు ముందస్తు ఏర్పాట్లు – ప్రతి గింజ తడవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి* 

వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వానాకాలం ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు–కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం సీజన్‌లో సుమారు 1,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 1,24,119 మెట్రిక్ టన్నుల సన్న రకం, 3,881 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 190 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి అదనపు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధరగా నిర్ణయించబడిందని తెలిపారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో BPT 5204, RNR 15048, HMT సోనా, జైశ్రీరామ్ సిగ్మెంటల్, KNM 1638, WGL 44, KNM 7715 అనే ఏడు రకాల సన్న వడ్లకు ఈ బోనస్ వర్తిస్తుందని తెలిపారు. దీంతో సన్న రకం ధాన్యానికి క్వింటాకు మొత్తం రూ.2,961 వరకు లభించేలా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకపు పరికరాలు, గన్నీ సంచులు తదితర అవసరమైన వసతులను ముందుగానే సమకూర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎంఎస్‌పీ ధరలు, నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం, సన్న రకం ధాన్యానికి అందించే బోనస్, సంబంధిత అధికారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కోసం అవసరమైన విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం అక్రమంగా తరలివచ్చే అవకాశాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సరిహద్దుల్లో  పటిష్ట నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం విక్రయానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కొనుగోలు రసీదులు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర, బోనస్, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎక్కువ కాలం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేయకుండా తక్షణమే రైస్ మిల్లులకు తరలించేలా రవాణా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

ధాన్యం నాణ్యతా ప్రమాణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం, తరుగు పేరుతో అన్యాయంగా కోతలు విధించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, సంబంధిత రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం విక్రయ ప్రక్రియ, మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, సన్న రకం ధాన్యానికి లభించే బోనస్‌పై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలకు తప్పనిసరిగా ట్యాగ్, కొనుగోలు కేంద్రం నంబర్ వేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం నిల్వకు అవసరమైన గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, ఇతర అనువైన భవనాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. వర్షాల కారణంగా ఏ ఒక్క ధాన్యం గింజ కూడా తడవకుండా టార్పాలిన్లు, ఇతర రక్షణ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లను వారి పరిధిలోని ధాన్యం నిల్వ సామర్థ్యం, అంచనా ధాన్యం పరిమాణం, అందుబాటులో ఉన్న నిల్వ సౌకర్యాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కొంతమంది అధికారులు అడిగిన వివరాలపై సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పరిధిలోని ధాన్యం నిల్వ సామర్థ్యం, అంచనా ధాన్యం పరిమాణం వంటి కీలక అంశాలపై అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. విధులకు సంబంధించిన ప్రాథమిక వివరాలపై స్పష్టత లేకుండా పనిచేయడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

అక్టోబర్ 1వ తేదీ నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తూకపు బాట్లను ముందుగానే తనిఖీ చేసి సీల్స్ వేయాలని తూనికలు–కొలతల శాఖ అధికారులకు సూచించారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

2026–27 రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను సకాలంలో పూర్తి చేసేలా రైస్ మిల్లులను తనిఖీ చేసి, వాస్తవ పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని పౌర సరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ , పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ బాబు,  జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి , మార్కెటింగ్ అధికారి అలీమ్ , రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనందరావు,  కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం: *దివ్యాంగ మహిళను స్వయంగా కలిసి అర్జీ స్వీకరించిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట*

     దివ్యాంగ మహిళకు సంబంధించిన సమస్యను సంబంధిత అధికారులు అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత అధికారులకు ఆదేశించారు.

     మంగళవారం నాడు సబ్-కలెక్టర్ కార్యాలయ ఆవరణ వెలుపల ఉన్న సందర్శకుల ప్రాంతంలో ఒక దివ్యాంగ మహిళను స్వయంగా కలిసి, ఆమె వినతిపత్రాన్ని నేరుగా స్వీకరించారు.

     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ మహిళకు సంబంధించిన వినతి పత్రాన్ని పరిశీలించి, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్-కలెక్టర్  సంబంధిత శాఖను ఆదేశించారు.

   అలాగే, ఆమె కేసును పరిశీలించి, అర్హత మేరకు అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఆమెకు కల్పించాలని సబ్-కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు.

      ఈ కార్యక్రమంలో డీఎవో భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: *వెట్‌ల్యాండ్స్‌ డీమార్కేషన్‌, అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్* 

 *క్షేత్రస్థాయిలో భౌతిక సరిహద్దుల నిర్ధారణతో పాటు రికార్డుల సమగ్ర పరిశీలన* 

 *అటవీ ఆక్రమణల నియంత్రణకు రెవెన్యూ, పోలీస్‌, అటవీ శాఖల సమన్వయంతో చర్యలు* 

వెట్‌ల్యాండ్స్‌ డీమార్కేషన్‌, అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో వెట్‌ల్యాండ్స్‌ సరిహద్దుల నిర్ధారణ, అటవీ భూముల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ, అటవీ భూముల మళ్లింపు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, సంబంధిత శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్‌ సింగ్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌, అదనపు కలెక్టర్‌ డి. వెంకటగోపాల్‌, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు.

వెట్‌ల్యాండ్స్‌ సరిహద్దుల నిర్ధారణలో కేవలం ఆన్‌లైన్‌ రికార్డులు, కేఎంఎల్‌ మ్యాపింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి, క్షేత్రస్థాయి పరిస్థితులను రికార్డులు, కేడస్ట్రల్‌ మ్యాపులు, అందుబాటులో ఉన్న పాత రికార్డులతో సరిపోల్చి పరిశీలించాలన్నారు. డీజీపీఎస్‌ సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానిని వినియోగిస్తూ వేగంగా డీమార్కేషన్‌ పూర్తి చేయాలని, అవసరమైన చోట మొబైల్‌ జీపీఎస్‌ ద్వారా కూడా క్షేత్రస్థాయి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.

వెట్‌ల్యాండ్స్‌ డీమార్కేషన్‌లో పాత నీటిపారుదల రికార్డులు, రెవెన్యూ రికార్డులు, సర్వే మ్యాపులు తదితరాలను సమగ్రంగా పరిశీలించి హద్దులను స్పష్టంగా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన ప్రతి డీమార్కేషన్‌కు సంబంధించిన ఫొటోలు, జీపీఎస్‌ వివరాలు, ఇతర ఆధారాలను భద్రపరచాలని సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన డీమార్కేషన్‌ పనులను రికార్డులతో మరోసారి సమీక్షించి, మిగిలిన ప్రాంతాల్లో సరిహద్దుల నిర్ధారణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. వెట్‌ల్యాండ్స్‌కు సంబంధించిన కేఎంఎల్‌ డేటా, కేడస్ట్రల్‌ మ్యాపులు, రెవెన్యూ రికార్డుల మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

వెట్‌ల్యాండ్స్‌ పరిధిలో ప్రభుత్వ, నీటిపారుదల శాఖ భూములు, ప్రైవేట్‌ భూములు, ఆక్రమణలకు సంబంధించిన అంశాలను స్పష్టంగా గుర్తించి ప్రత్యేకంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల రికార్డుల్లో ఉన్న వివరాలను పరస్పరం సమన్వయం చేసుకుని భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్‌ నిర్వహించాలని సూచించారు.

అటవీ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించి, రెవెన్యూ, పోలీస్‌, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్‌ భూములపై ఉన్న ఆక్రమణలను రికార్డుల ఆధారంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. అటవీ భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి, ఆక్రమణలకు అవకాశం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు . అటవీ ఆక్రమణల తొలగింపు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో చేపట్టే చర్యలకు అవసరమైన సందర్భాల్లో పోలీస్‌ శాఖ సహకారం ముందుగానే సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటవీ సిబ్బందిపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, అటవీ సంరక్షణకు పోలీస్‌, రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అటవీ భూముల మళ్లింపు,  అటవీ భూముల కేటాయింపు, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ (ఎఫ్‌సీఏ), రహదారులు, విద్యుత్‌ లైన్లు తదితర అంశాల్లో శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ భూముల మళ్లింపులో నిబంధనలు, అనుమతులు, పరిహార భూముల వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల్లో అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు, షరతుల అమలును కూడా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ దరఖాస్తులు, కోర్టు కేసులు, రెవెన్యూ–అటవీ భూముల హద్దుల వివాదాలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అర్హత లేని దరఖాస్తుల విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా స్పష్టమైన కారణాలతో ఉత్తర్వులు జారీ చేయాలని, పెండింగ్‌ కేసులను మండలాల వారీగా సమీక్షించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అటవీ సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అన్నారు . అటవీ ప్రాంతాలు, అభయారణ్యాల పరిధిలో విద్యుత్‌ లైన్ల కారణంగా వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా అవసరమైన సాంకేతిక చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్‌ లైన్ల ఏర్పాటుపై సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

కిన్నెరసాని ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి రూపొందించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కిన్నెరసాని అభయారణ్య ప్రాంతంలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి, సఫారీ, కాటేజీలు, గిరిజన పర్యాటక సర్క్యూట్‌, మ్యూజియం తదితర ప్రతిపాదనలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని తెలిపారు.


ప్రతి శాఖ తన పరిధిలో చేపడుతున్న పనులపై నెలవారీ పురోగతి వివరాలను సిద్ధం చేసుకుని సమీక్షకు సమర్పించాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. అటవీ, రెవెన్యూ, పోలీస్‌, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, ఐటీడీఏ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే భూ పరిరక్షణ, అటవీ సంరక్షణ, అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.

ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం. విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఎఫ్‌డీఓ నిషా, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్లు, అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలం: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య అవగాహన

భద్రాచలం: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు ఆరోగ్య అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్ మాట్లాడుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, పొగాకు మరియు మద్యం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, తగినంత నిద్ర పొందడం వంటి అంశాలు గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని వివరించారు.
అదేవిధంగా చెవుల ఆరోగ్యం మరియు వినికిడి లోపాలపై అవగాహన, పోషకాహారం ప్రాధాన్యత, పాముకాటు నివారణ మరియు అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నషా ముక్త్ భారత్ అభియాన్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, సమాజంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ విల్సన్, కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ సుందాకర్, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

రక్తహీనత, పోషకాహారంపై అవగాహన
డాక్టర్ బి. సైదులు, ఏడీఎంహెచ్ఓ (టి), ఐటీడీఏ భద్రాచలం విద్యార్థులకు రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల వినియోగం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై వివరంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మునగ ఆకులు మరియు మునగకు సంబంధించిన ఆహార పదార్థాలలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. రోజువారీ ఆహారంలో స్థానికంగా లభించే పోషకాహార పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు.

కుష్ఠు వ్యాధిపై సమగ్ర అవగాహన
మోహన్ తేజావత్, డీపీఎంఓ విద్యార్థులకు కుష్ఠు వ్యాధి (Leprosy) పై సమగ్ర ఆరోగ్య విద్యను అందించారు. కుష్ఠు వ్యాధి లక్షణాలు, ప్రారంభ దశలోనే గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం, చికిత్స పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉండటం, వ్యాధి కారణంగా వచ్చే వైకల్యాల నివారణ వంటి అంశాలను వివరించారు.
కుష్ఠు వ్యాధిపై ఉన్న అపోహలు మరియు భయాలను తొలగించాల్సిన అవసరాన్ని వివరించారు. కుష్ఠు వ్యాధి నయం చేయగల వ్యాధి అని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి పరీక్షలు మరియు అవసరమైన చికిత్స పొందాలని సూచించారు. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న వారిపై వివక్ష చూపకుండా, వారికి కుటుంబ సభ్యులు మరియు సమాజం సహకారం అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా హృదయ ఆరోగ్యం, పోషకాహారం, వ్యాధుల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఇల్లందు: *గుండాల, బోడు, కొమరారం పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్*

*సీసీటీఎన్‌ఎస్‌ 2.0లో కేసుల వివరాలను సకాలంలో నమోదు చేయాలి*

*సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం గుండాల, బోడు, కొమరారం పోలీస్ స్టేషన్లను సందర్శించి తనిఖీ చేశారు. గుండాల పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించి, పోలీస్ స్టేషన్లలో రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.

గుండాల పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన సందర్భంగా కాంపౌండ్ వాల్, గార్డ్ పోస్ట్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, స్టేషన్‌ ప్రాపర్టీ భద్రతకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తుల వివరాలను అడిగి తెలుసుకొని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీసీటీఎన్‌ఎస్‌ 2.0లో కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, ఇతర వివరాలను సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని, పోలీసింగ్ వెబ్ అప్లికేషన్లపై ప్రతి పోలీస్ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో బాధ్యతగా వ్యవహరించి, వారికి న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో  సీఐలు తిరుపతి, సత్యనారాయణ, ఎస్‌ఐలు, శ్రవణ్ కుమార్, రాజమౌళి, నాగుల్ మీరా, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అశ్వారావుపేట: *అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్* 

 *నరసాపురంలో భూ రీ సర్వే పరిశీలన. గురుకుల పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు* 

 *రికార్డుల ఆధారంగా భూముల వివరాలను పక్కాగా నిర్ధారించాలి* 

 *విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యతలో రాజీ వద్దు* 

 *ఫుడ్‌ పాయిజనింగ్‌కు తావులేకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి* 

అన్నపురెడ్డిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి భూ రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, గురుకుల విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల, తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేసి భూ రీ సర్వే పురోగతి, విద్యార్థులకు అందుతున్న వసతులు, ఆహార నాణ్యత, పారిశుధ్యం, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్, సర్వే సిబ్బంది, తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ విస్తీర్ణం, గ్రామ సరిహద్దులు, పట్టా భూములు, వివిధ సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. భూ రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన విస్తీర్ణం, హక్కుదారు, సంబంధిత శాఖ వివరాలను రెవెన్యూ, సర్వే, అటవీ, ఇతర సంబంధిత శాఖల రికార్డులతో సమగ్రంగా సరిపోల్చి నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.

నరసాపురం గ్రామంలో సుమారు 1,058 ఎకరాల భూమి, సుమారు 13.5 కిలోమీటర్ల గ్రామ సరిహద్దు ఉన్న నేపథ్యంలో సరిహద్దుల నిర్ధారణతో పాటు భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన గ్రామసభలో వచ్చిన అంశాలను కూడా పరిశీలించాలని తెలిపారు. అన్నదైవం ప్రాజెక్టుకు సంబంధించిన భూములు, సర్వే నంబర్ 47లోని ఎండోమెంట్/దేవాదాయ భూముల వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించాలని ఆదేశించారు.

సర్వే నంబర్ 39 లోని సుమారు 264 ఎకరాల  భూమికి సంబంధించి ఖచ్చితమైన హక్కుదారు, సంబంధిత శాఖ వివరాలను రికార్డుల ఆధారంగా నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు. ఈ భూమికి సంబంధించి అటవీ శాఖ ఆక్రమణ ఉందంటూ వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో రెవెన్యూ, అటవీ శాఖ రికార్డులను పరస్పరం పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ 40లోని సుమారు 200 ఎకరాల భూమికి సంబంధించిన దానం/దత్తత వివరాలు, హక్కులు, బదలాయింపు రికార్డులను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను నిబంధనల ప్రకారం పరిశీలించి పారదర్శకంగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటశాల, స్టోర్ రూమ్, విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, రాగిజావ, చికెన్ తదితర ఆహార పదార్థాలు అందుతున్నాయా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, వంటశాలలో పరిశుభ్రత పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. బియ్యం, పప్పులు తదితర నిత్యావసర సరుకుల నిల్వలను తనిఖీ చేసి నాణ్యత, నిల్వ విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న మెనూ, అల్పాహారం, రాగిజావ, చికెన్ తదితర ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న ఏకరూప దుస్తులు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలోని ప్రహరీ, విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాలికల గురుకులంలోని వంటశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని, మెనూ అమలు తీరును, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. బియ్యం, పప్పులు తదితర సరుకులను కప్పి, సురక్షితంగా నిల్వ చేయాలని, వంటశాలలో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని ఆదేశించారు. వంటశాలలో బల్లులు, ఎలుకలు, ఇతర కీటకాలు ప్రవేశించకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని, ఆహార కలుషితానికి, ఫుడ్‌ పాయిజనింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని, పాములు, విషపూరిత జంతువులు ప్రవేశించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల మధ్య ఏవైనా సమస్యలు, వివాదాలు తలెత్తితే సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం కల్పిస్తున్న ప్రతి సౌకర్యం, పథకం పూర్తి స్థాయిలో వారికి అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ స్వర్ణ, ఆయా గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్వే సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: *అటవీ కమాండ్ కంట్రోల్ టీమ్‌కు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ* 

 *24×7 విస్తృత పర్యవేక్షణ.. సమాచారంపై తక్షణ స్పందన.. ఫిర్యాదుల స్వీకరణకు కమాండ్ కంట్రోల్ సెంటర్* 

కొత్తగూడెం, సెప్టెంబర్ 29:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ & కంట్రోల్ సెంటర్‌లో అటవీశాఖ కమాండ్ కంట్రోల్ టీమ్‌కు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

 *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్, IPS గారి సహకారం మరియు మార్గదర్శకత్వంతో, జిల్లా అటవీ అధికారి శ్రీ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, IFS గారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.* 

పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఇన్‌చార్జ్ CI శ్రీ రమాకాంత్ గారు ప్రత్యేకంగా పాల్గొని, అటవీశాఖ కమాండ్ కంట్రోల్ టీమ్‌కు సమాచార స్వీకరణ, విశ్లేషణ, పర్యవేక్షణ, అత్యవసర స్పందన, ఫీల్డ్ బృందాలతో సమన్వయం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణతో పాటు విలువైన సూచనలు అందించారు.

పోలీస్ శాఖలో అమలవుతున్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థలోని అనుభవాలను ఆధారంగా చేసుకుని, సమాచారం అందిన వెంటనే దాని ప్రాధాన్యతను గుర్తించడం, సంబంధిత అధికారులకు తక్షణ సమాచారం చేరవేయడం, ఫీల్డ్ స్థాయిలో చేపట్టిన చర్యలను పర్యవేక్షించడం, సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతర ఫాలోఅప్ నిర్వహించడం వంటి అంశాలను CI శ్రీ రమాకాంత్ గారు సిబ్బందికి ప్రాయోగికంగా వివరించారు.

 *సమాచారం నుంచి చర్య వరకు సమర్థవంతమైన సమన్వయం* 

ఈ సందర్భంగా DFO శ్రీ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, IFS గారు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అటవీ సంరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో కమాండ్ & కంట్రోల్ సెంటర్‌ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

 *“కమాండ్ & కంట్రోల్ సెంటర్ కేవలం సమాచారం స్వీకరించే కేంద్రం కాదు. అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అందిన సమాచారాన్ని తక్షణ చర్యగా మార్చే కీలక వ్యవస్థగా ఇది పనిచేయాలి” అని DFO గారు స్పష్టం చేశారు.* 

పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలోని అనుభవాలను అటవీశాఖ సాంకేతిక మరియు ఫీల్డ్ స్థాయి సామర్థ్యాలతో అనుసంధానం చేయడం ద్వారా సమాచారం నుంచి చర్య వరకు వేగవంతమైన సమన్వయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

 *24×7 విస్తృత పర్యవేక్షణ* 

కమాండ్ & కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలోని అటవీ ప్రాంతాలకు సంబంధించిన అటవీ నేరాలు, అక్రమ కలప నరికివేత మరియు రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ ఆక్రమణలు, అటవీ అగ్ని ప్రమాదాలు, అనుమానాస్పద కార్యకలాపాలు తదితర అంశాలపై 24×7 నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

అందిన ప్రతి సమాచారాన్ని నమోదు చేసి, దాని తీవ్రతను బట్టి సంబంధిత రేంజ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ మరియు ఫీల్డ్ సిబ్బందికి తక్షణమే చేరవేసి, చేపట్టిన చర్యలపై నిరంతర పర్యవేక్షణ మరియు ఫాలోఅప్ నిర్వహించే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు.

సమాచారం అందిన సందర్భంలో సంబంధిత అధికారులకు వెంటనే అలర్ట్ చేయడంతో పాటు, ఫీల్డ్ స్థాయిలో తీసుకున్న చర్యలను తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ, అవసరమైన సందర్భాల్లో తదుపరి సమన్వయం చేపట్టే విధంగా వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు.

 *ప్రజలు కూడా సమాచారం, ఫిర్యాదులను అందించవచ్చు* 

అటవీ ప్రాంతాల్లో అక్రమ కలప నరికివేత, అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అటవీ నేరాలకు సంబంధించిన సమాచారం ఎవరి వద్ద ఉన్నా, వారు కమాండ్ & కంట్రోల్ సెంటర్‌కు సమాచారం లేదా ఫిర్యాదు అందించవచ్చని అధికారులు తెలిపారు.

ప్రజలు, అటవీ ప్రేమికులు, స్థానికులు, అధికారులు మరియు అటవీ సిబ్బంది అందించే సమాచారాన్ని తక్షణమే పరిశీలించి, అవసరమైన సందర్భాల్లో సంబంధిత ఫీల్డ్ అధికారులకు చేరవేసి చర్యలు తీసుకునేలా సమన్వయం చేయబడుతుందని పేర్కొన్నారు.

 *“అటవీ సంరక్షణ బాధ్యత కేవలం అటవీశాఖది మాత్రమే కాదు. అటవీ నేరాలు లేదా అటవీ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై ప్రజల వద్ద ఉన్న సమాచారం కూడా ఎంతో విలువైనది. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన సమాచారాన్ని కమాండ్ & కంట్రోల్ సెంటర్ దృష్టికి తీసుకురావడం ద్వారా అటవీ సంరక్షణలో భాగస్వాములు కావాలి” అని అధికారులు తెలిపారు.* 

 *సాంకేతికతతో మరింత పటిష్టమైన అటవీ సంరక్షణ* 

ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా కమాండ్ కంట్రోల్ టీమ్‌కు సమాచారాన్ని వేగంగా స్వీకరించడం, విశ్లేషించడం, సంబంధిత సిబ్బందికి చేరవేయడం, ఫీల్డ్ స్థాయిలో చేపట్టిన చర్యలను పర్యవేక్షించడం, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ నిర్వహించడం వంటి అంశాల్లో మరింత స్పష్టమైన అవగాహన ఏర్పడింది.

24×7 అప్రమత్తంగా పనిచేసే కమాండ్ & కంట్రోల్ సెంటర్, సాంకేతిక పర్యవేక్షణ, ప్రజల నుంచి వచ్చే సమాచారం, ఫీల్డ్ సిబ్బంది నుంచి వచ్చే నివేదికలు మరియు సంబంధిత అధికారుల సమన్వయాన్ని ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి అటవీ సంరక్షణను మరింత పటిష్టం చేసే కీలక వ్యవస్థగా పనిచేయనుంది.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సిబ్బంది రమాకాంత్ CI గారు, షైక్ ఇమామ్ గారు, రాజేందర్  SI గార్లు, మరియు రాకేష్, ఉపేందర్, రాజేశ్వరి గార్లు అటవీశాఖ అధికారులు మరియు కమాండ్ & కంట్రోల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: పాల్వంచ: కొత్తగూడెం–పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ హమాలీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.

హమాలీ కాలనీలోని మారబోయిన శ్రీను ఇంటి నుంచి కుంజా శివ ఇంటి వరకు సుమారు 151 మీటర్ల మేర సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. గతంలో ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా, ప్రస్తుతం పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చొరవతో ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు స్థానిక ప్రజలు తెలిపారు.
కొత్తగూడెం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం

 చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు, వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు

 పాల్వంచ ఐఆర్‌సీఎస్ భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తాం: కలెక్టర్ అంకిత్

కొత్తగూడెం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. జిల్లా శాఖ నూతన చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు, వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు, కోశాధికారిగా తోటమల్ల బాలయోగి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా వై. సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 11 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించిన అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులను నూతన కమిటీ సభ్యులు అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాల్వంచలో ఐఆర్‌సీఎస్‌కు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐఆర్‌సీఎస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కార్యక్రమాలను నిర్వహించేలా ఐక్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించడంతో పాటు, రెడ్ క్రాస్ సేవలను విద్యార్థులు, ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లా శాఖ అభివృద్ధికి, సేవా కార్యక్రమాల విస్తరణకు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
కొత్తగూడెం: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 

 కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి

 ఆహారం, పారిశుధ్యం, హాజరు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ

 విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు 

 చలికాలంలో వెచ్చని నీరు, దుప్పట్లు అందుబాటులో ఉంచాలి

 దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా చర్యలు 

 ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి

రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

సోమవారం రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి  వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యతో పాటు వారికి అందుతున్న మౌలిక వసతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కలెక్టర్లు క్రమం తప్పకుండా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఆహార విషబాధ, ఎలుకలు, పాముకాటు వంటి ఘటనలు చోటుచేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎస్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సీఎస్ తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల లోపాలు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. వంటశాలలను ఆధునీకరించే అవకాశం ఉన్న చోట్ల పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించాలని సంజయ్ జాజు తెలిపారు. విద్యాసంస్థల్లోని సౌకర్యాలు, లోపాలు, చేపట్టిన పరిష్కార చర్యల వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టిన మార్పులను ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుంటుందని తెలిపారు.

జిల్లాలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రతికూల నివేదికలు వచ్చినప్పుడు అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని సీఎస్ సూచించారు. ఏదైనా సమాచారం తప్పుడు ప్రచారంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, వాస్తవంగా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి అమలు చేస్తోందని, కాస్మెటిక్ ఛార్జీలను డీబీటీ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.

రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన దుప్పట్లను ముందుగానే సమకూర్చాలని సీఎస్ ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థల భవన యజమానులతో కలెక్టర్లు సమావేశమై అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణ అందేలా చర్యలు చేపట్టాలని సీఎస్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతిరోజూ ఒక లక్ష యూనిఫారాలు కుట్టేలా చర్యలు తీసుకోవాలని, దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. యూనిఫాం క్లాత్ ఇప్పటికే జిల్లాలకు చేరినందున కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలు, సమస్యల పరిష్కార వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు.

 *అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ* , జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, ఆహారం, పారిశుధ్యం, హాజరు, మౌలిక వసతులపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెచ్చని నీరు, దుప్పట్లు తదితర అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు.

జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించిన వివరాలు, సమస్యలు, చేపట్టిన పరిష్కార చర్యలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపడతామని కలెక్టర్ అంకిత్ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీలత సంబంధిత శాఖల అధికారులు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

*డాగ్ కెన్నెల్, బీడీ టీమ్ సదుపాయాల ఏర్పాటుకు పనులు వేగవంతం చేయాలి*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సోమవారం నాడు సందర్శించారు. హెడ్‌క్వార్టర్స్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి, మరమ్మతుల పనులను పరిశీలించారు.

 డాగ్ కెన్నెల్, బీడీ టీమ్‌లను పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేయటం  కోసం అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి  పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదేవిధంగా హెడ్‌క్వార్టర్స్‌లో అవసరమైన ఇతర మరమ్మతులు, మౌలిక సదుపాయాల పనులను కూడా  పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఎంటీఓ సుధాకర్, ఆర్‌ఐ అడ్మిన్ లాల్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరు: *అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్  నిర్వహించారు.ఆపరేషన్‌లో భాగంగా గ్రామంలోని ఇళ్లను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు మరియు నేరాలకు సంబంధించిన అంశాలపై పోలీసులు ఆరా తీశారు. గ్రామంలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి గ్రామస్థులతో మాట్లాడుతూ, ఈ ఏడాది అశ్వాపురంపాడు గ్రామంలో మూడు నేర ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో నేరాలు పునరావృతం కాకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని గ్రామస్థులకు తెలిపారు.

అనంతరం గ్రామంలోని  చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. పోలీసు శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ప్రజలతో మమేకమై వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తుందని తెలిపారు. గ్రామస్థులు ఎలాంటి సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు , ఎస్సై పివిఎన్ రావు , పోలీస్  సిబ్బంది పాల్గొన్నారు.