ఉరవకొండ: దుద్దేకుంట గ్రామంలో వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి, దుగ్గెమ్మ దేవతల జలది పూజా మహోత్సవం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని దుద్దేకుంట గ్రామంలో శనివారం సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామి దుగ్గెమ్మ దేవతల జలది పూజా మహోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పూజల్లో భాగంగా సెలయేటి నుండి గంగా జలాన్ని కళాశాలలో తీసుకువచ్చి మూల విరాట్ దేవతలకు అభిషేకించారు. అనంతరం రైతుల పంటలకు సంబంధించి భవిష్యవాణిని పూనకంతో ఉన్న పూజారులు తెలియజేశారు. జలది పూజా మహోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకున్నారు.