గిద్దలూరు: ప్రేమ విఫలమైందని కంభం రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుడిని రక్షించిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో, కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు రైలు పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అతన్ని రక్షించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఎస్ఐ శివకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ విఫలం కావడంతో లండన్లో మాస్టర్స్ డిగ్రీ చదివిన యువకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్ అనంతరం అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.